NTV Telugu Site icon

హుజురాబాద్ ఉపఎన్నిక: కరోనా పరిస్థితులపై పరిశీలన

త్వరలోనే హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో కరోనా పరిస్థితులపై వైద్య శాఖ పరిశీలించింది. ఈమేరకు జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాసరావు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలో కోవిడ్ స్థితిగతులను చూడటానికి వైద్య ఆరోగ్య శాఖ బృందం రావడం జరిగింది. మేము సీఎం ఓఎస్డీ నరేందర్ బృందం జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను విజిట్ చేసాం. జమ్మికుంట హెల్త్ సెంటర్ లో కోవిడ్ పేషేంట్స్ కోసం ఐసోలేషన్ మరియు ఆక్సిజన్ సెంటర్ గా ఏర్పాటు చేసాం. హుజురాబాద్ లో పొలిటికల్ ఆక్టివిటి ఎక్కువ అవడం వల్ల అక్కడక్కడ మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు అదుపులో ఉన్నపటికీ కూడా కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ డివిజన్ షబ్ సెంటర్ లలో కేసులు పెరుగుతున్నాయి. గత నాలుగు వారాల క్రితం కూడా ఇక్కడ విజిట్ చేసాం. ఈ రోజు జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ లు సూపరెండేంట్ లతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. జమ్మికుంట కమ్యూనిటి సెంటర్లో గత నాలుగు నెలలుగా కోవిడ్ సేవలు అందించడం జరుగుతుంది. రేపటి నుండి నాన్ కోవిడ్ సేవలను అందించే విధంగా ఆదేశాలు జారీ చేసాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తగా కోటి యాబై లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసుకోవడం జరిగింది. హుజురాబాద్ లో రాబోయే ఉప ఏ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఏర్పాటకను పూర్తి చేస్తున్నాం. ఇక్కడ స్పెషల్ గా మొదటి రెండు డోస్ వ్యాక్సినేషన్ ఎల్జీబిలిటీ ఉన్న వారందరికీ నాలుగైదు రోజులలో వ్యాక్సినేషన్ అందించాడానికి అన్ని ఏర్పాట్లు చేసామని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాసరావు తెలిపారు.