Site icon NTV Telugu

Online Games: ‘నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను’.. భార్యకు భర్త లెటర్..!

One Line Games

One Line Games

Online Games: ఒకప్పుడు ఈజీ మనీ కోసం పేకాట, బెట్టింగ్‌లు చేసేవారు. వాటికి బానిసలై.. లక్షల్లో నష్టాలు, అప్పులు తీర్చే మార్గం లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశాం. ఇది సాంకేతిక యుగం. అందుకే రూట్ మార్చారు. ఈ కాలం యువత ఆన్‌లైన్ గేమ్‌లకు అడిక్ట్ అయ్యారు. ఆన్ లైన్ లో రమ్మీ, పేకాట ఆడుతూ లక్షలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసయ్యాడు. తనకు భార్య అక్కర్లేదని మనస్తాపం చెందాడు. ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని లేఖ రాసి అదృశ్యమయ్యాడు.

Read also: Ananya Panday : హాట్ డ్రెస్ లో అదరగొడుతున్న లైగర్ బ్యూటీ..

చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నామగుండు ప్రాంతానికి చెందిన మెగావత్ దాతు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం రేణుక అనే యువతితో వివాహమైంది. రేణుక స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. కానీ డాటు ఆన్‌లైన్ గేమ్‌లకు బానిస అయ్యాడు. ఇప్పటికే లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న రేణుక భార్య ఆటలు ఆడవద్దని హెచ్చరించింది. దాతు భార్యతో గొడవ పడ్డాడు. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటూ ఆమెతో గొడవకు దిగాడు. ఆ తర్వాత కొన్ని రోజులు భార్యతో మాట్లాడడం మానేశాడు. ఈ నెల 28న రేణుక డ్యూటీకి వెళ్లింది. పని ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చింది. ఇంట్లో భర్త కనిపించలేదు. చాలా సేపు ఎదురుచూసి ఇంటికి రాలేదు. కాల్ చేసినా స్పందన లేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఆందోళన చెందిన రేణుక బంధువులను అడిగింది. కానీ ప్రయోజనం లేకపోయింది. అయితే ఆమె ఇంట్లో టేబుల్‌పై ఓ లేఖ కనిపించింది. ‘నేను ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను’ అని లేఖలో రాసి ఉంది. అది చూసి షాక్ అయిన రేణుక వెంటనే పోలీసులను ఆశ్రయించింది. రేణుక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Gold Price Today : మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?

Exit mobile version