Dowry Harassment: పాలు విరిగాయన్న నెపంతో అత్తింటివారు ఆ కోడలి పై తమ ప్రతాపం చూపారు. అదనపు కట్నం తెమ్మంటూ రాచిరంపాన పెట్టారు. ఒళ్ళంతా వాతలు తేలేలా మెటల్ పైపుతో మూడ్రోజుల పాటు కొట్టి నరకం చూపారు. ఈ అమానవీయమైన ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో జరిగింది.
Read also: KTR Tweet: ఎంత అవమానం!! కేటీఆర్ ట్విట్ వైరల్
సనత్ నగర్ అల్లాఉద్దీన్ కోఠికు చెందిన హీనా బేగం(28)ను ఎల్లారెడ్డిగూడకు చెందిన కారు డ్రైవర్ అక్మల్ హుస్సేన్(42) తో నాలుగేళ్ళ క్రితం పెద్దలు సమక్షంలో ఘనంగా వివాహం చేశారు. కట్నకానుకల కింద రూ.2 లక్షల కట్నం, నాలుగున్నర తులాల బంగారం, ఇతర లాంఛనాలు ఇచ్చి పెండ్లి చేశారు. అప్పటికే అక్మల్ హుస్సేన్ కు మెదటి పెండ్లి పెటాకులైన విషయం దాచిపెట్టారు. తర్వాత పెళ్లి విషయం తెల్సినా హీనా బేగం సర్దుకుని కాపురం చేయసాగింది. కొన్నాళ్ళ పాటు వీరి కాపురం సజావుగా సాగటంతో ఇద్దరు సంతానం కలిగారు. అయితే కొద్దిరోజుల పెళ్ళైనప్పటి నుంచి భర్త అక్మల్ హుస్సేన్, అత్త అఫ్రోజ్ బేగం, ఆడపడుచు సోని, మరిధిలు తబ్రేజ్, అయ్యూబ్లు కలిసి ఆమెని శారీరకంగా, మానసికంగా హింసించారు. మీ పుట్టింటి నుంచి అదనపు కట్నం తేలాలని ఆమె చీటికీమాటికి కొట్టేవారు. బిడ్డ కాపురం బాగు పడుతుందేమోననే ఆశతో అప్పుసొప్పు చేసి మళ్లీ రూ.2.50 లక్షలు వరకు అత్తింటి వారికి ముట్టజెప్పారు.
Read also: Nude Photo Case: స్కానింగ్ సెంటర్ లో న్యూడ్ ఫోటోల కేసు.. మరో బడా ఆసుపత్రిలో..
అయినా ఆ కట్న పిశాచుల ధనదాహం తీరలేదు. వేధింపుల్ని భరిస్తూ.. భర్తతో మార్పు వస్తుందేమోనని ఆశగా ఎదురుచూసేది ఆ ఇల్లాలు. కాపురాన్ని కాలదన్ను కోలేక బిడ్డల కోసం అన్నీ భరిస్తూ వచ్చింది ఆ ఇల్లాలు. కాగా అత్తింట్లో పొయ్యి పై పాలు వేడి చేసి మరిగించేటప్పుడు.. పాలు విరిగిపోయాయి.. పాపిష్టిదానా పాలు విరగొట్టావంటూ ఒక్కసారిగా భర్త, అత్త, ఆడపుడుచు, మరిదిలు అంతా కిలిస హీనా పై మెటల్ పైపుతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారుత ఇంట్లో మూడ్రోజుల పాటు నిర్బందించి మెటల్ పైపుతో ఆమెని చావబాదారు. ఒళ్ళంతా గాయాలతో కమిలిపోయింది. హీనా స్పృహ కోల్పోయింది. దీంతో హీనా తల్లిదండ్రులకు కాల్ చేశారు. మీ కూతురు చనిపోయిందంటూ ఫోన్ చేసి చెప్పారు. షాక్ తిన్న హీనా కుటుంబం పురుగున వచ్చి చూడగా అపస్మారకస్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. అత్తింటివారి దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు హీనాను చికిత్స కోసం అమీర్ పేట ప్రభుత్వ దవాఖానాకి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
Monsoon: నేటి నుంచి వర్షాకాలం ప్రారంభమైనట్టే.. నేడు,రేపు పొడివాతావరణం