Site icon NTV Telugu

Emotional Incident : అమ్మకు ప్రేమతో.. కొడుకు చేసిన పనికి అంతా భావోద్వేగం..!

Mla Sanjay Kumar

Mla Sanjay Kumar

Emotional Incident : జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ హృదయవిదారక ఘటన అందరి మనసును తాకింది. ఆకలి బాధను తట్టుకున్నా… తల్లి నొప్పిని మాత్రం తట్టుకోలేకపోయాడు ఓ కుమారుడు. ఆ తల్లిపైన ప్రేమ, త్యాగం, అంకితభావం చూసిన వారంతా కళ్లతుడుచుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన దీపక్ అనే యువకుడు తన అనారోగ్యంతో ఉన్న తల్లిని చికిత్స కోసం జగిత్యాలకు తీసుకువచ్చాడు. జేబులో పైసా లేకపోయినా, తల్లిని కాపాడాలనే తపనతో బస్ ఎక్కి జగిత్యాలకు చేరుకున్నాడు.

మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉండడంతో తల్లి బస్సులో ప్రయాణించగా, దీపక్ తన తల్లి పక్కనే కూర్చుని వచ్చాడు. బస్టాండ్‌కి చేరుకున్న తర్వాత ఆసుపత్రికి వెళ్లేందుకు ఆటో డ్రైవర్‌ను అడగగా, అతడు రూ.50 అడిగాడు. జేబు ఖాళీగా ఉండడంతో ఆ మొత్తాన్ని ఇవ్వలేక, తన తల్లిని భుజాన వేసుకుని నడవడం ప్రారంభించాడు.

Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్‌లో 22 వికెట్లు తీసిన డీఎస్పీ.. ఆమె ఎవరో తెలుసా?

తల్లి కోసం కుమారుడు చేసిన ఆ ప్రయత్నం చూసి, చుట్టుపక్కల ఉన్నవారు ఒక్కసారిగా స్తంభించారు. కొందరి కళ్లలో నీరు తిరిగింది. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని గమనించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్షణంలోనే ఆగిపోయారు. ఆ తల్లి-కుమారుడి పరిస్థితి చూసి ఆయన మనసు కరిగిపోయింది. వెంటనే తన కారులో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి, డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందేలా చేశారు. చికిత్స పూర్తయ్యాక తల్లిని, కుమారుడిని తిరిగి బస్టాండ్‌ వద్దకు చేర్పించారు.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మానవత్వం, దీపక్ తల్లిపైన చూపిన ప్రేమ.. ఇవి రెండూ కలసి జగిత్యాలలో మానవతకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ కుమారుడి ప్రేమను, ఎమ్మెల్యే ఔదార్యాన్ని కొనియాడుతున్నారు.

Women’s World Cup Final: ఆటలో ఆధిపత్యం, పాటలో పరవశం – టీమిండియా విక్టరీ సాంగ్..!

Exit mobile version