ఇటీవల జరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున సీఎం కేసీఆర్ త్వరలోనే 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ పోలీస్ శాఖలో కూడా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అధికారులు త్వరలోనే పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలో నేడు పోలీస్ ప్రీ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించగా విశేష స్పందన వచ్చింది.
దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లోని 5 జోన్ల పరిధిలో 21 వేల మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, 36 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 16 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారని వెల్లడించారు. ప్రతి జోన్ నుంచి 1,000 మంది చొప్పున ఎంపిక చేస్తామని, మొత్తంగా 5 వేల మందికి 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.
