Site icon NTV Telugu

Fire Accident: తంగళ్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

Fire Accident

Fire Accident

Fire Accident: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం టెక్స్ టైల్ పార్క్ సమీపంలోని పౌర సరఫరాల శాఖ గోడౌన్‌లో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలను రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. మంటల్లో ఖాళీ గోనె సంచులు పూర్తిగా కాలిపోయాయి. మంటలకు గోడౌన్ గోడలు పూర్తిగా దెబ్బ తినడంతో అధికారులు గోడలను కూల్చివేశారు. కోటికి పైగా అస్థి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు

గోడౌన్‌ లోపల షార్ట్‌ సర్క్కూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.గోడౌన్‌లో సుమారు 13 లక్షల గన్ని బ్యాగ్స్ ఉండడంతో గోదాం గోడలను జేసీబీలతో అధికారులు కూల్చివేశారు. చాలావరకు సంచులను కాలకుండా కాపాడేందుకు ప్రయత్నించారు. సంఘటనా స్థలానికి చేరుకొని సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్, తంగళ్లపల్లి ఎస్సై లక్ష్మారెడ్డి, సిరిసిల్ల ఎమ్మార్వో విజయ్ విచారణ చేపట్టారు.

Exit mobile version