Huge fire accident at chintalmet in rangareddy district: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల మీద ఐదు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. చింతల్ మెట్ చౌరస్తా లోని ఓ పరుపుల గోదామ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దూది, కట్టే వస్తువులు ఉండడంతో క్షణాల మీద మంటలు వ్యాపించాయి. గోదాంలో ఉన్న ఓ వాహనం పూర్తిగా దగ్ధం మైంది. గోదాంలో ఎవ్వరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు మంటలను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు.
పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. ఫోన్ చేసిన 40 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్ని. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. గోదాంలోని పరుపులు పూర్తిగా దగ్ధం మయ్యాయి. లక్షలల్లో ఆస్తి నష్టం జరిగింది. శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. విద్యుత్ ఘాతంతో అగ్ని ప్రమాదం జరినట్లు సమాచారం.
కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదు దుకాణాలలో ఉన్న విలువైన సామాగ్రి పూర్తీగా దగ్దమైంది. దట్టమైన పొగ వ్యాపించడంతో మంటలు ఆర్పడానికి స్థానికులు ఇబ్బంది పడ్డారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడడం, నల్లటి పొగ వ్యాపించడంతో ఉక్కిరిబిక్కిరియైన స్థానికులు బయటకు పరుగులు తీసారు. పక్కనే పని చేస్తున్న కార్మికులు మంటలను గమనించి దుకాణాల నుండి బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. ఏలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Teacher’s Day : నటులుగా అలరించిన పంతుళ్ళు!
