TS Temperature: తెలంగాణలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. రుతుపవనాలు దాదాపు 2 వారాలు ఆలస్యంగా రాష్ట్రాన్ని ముంచెత్తాయి. జూన్ మొదటి వారంలో కురవాల్సిన వర్షాలు.. జూన్ 20 తర్వాత అడపాదడపా కురిశాయి. ఆ తర్వాత జూలై చివరి వారంలో వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జలాశయాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లాల్లో కూడా వరదల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆగస్టులో మళ్లీ వరుణుడు ముఖం చూపించాడు. సెప్టెంబర్ నెలల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ నెల ప్రారంభంలో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతంలో గంటకు 17 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
అరేబియా సముద్రం మీదుగా గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న పది రోజుల పాటు వాతావరణం వేడిగా ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో ఉండే వాతావరణం ఇక్కడ ఉంటుందని తెలిపారు. పగటిపూట వాతావరణం చాలా వేడిగా ఉంటుందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో రాత్రులు, ఉదయం ఉష్ణోగ్రతలు 19-22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతాయి. అయితే పగటిపూట భానుడు తన ప్రతాపాన్ని చూపుతాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపు 33-36 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటాయి. నైరుతి రుతుపవనాలు తగ్గుముఖం పట్టాయని, అక్టోబర్ 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తెలంగాణలో ఈ నెల 9వ తేదీ వరకు పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
Cyber Fraud: ఇలాంటి కాల్స్‌తో జాగ్రత్త.. ఉద్యోగం పేరుతో రూ. 1.09 లక్షలు కాజేసిన కేటుగాళ్లు