NTV Telugu Site icon

Big Breking: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు..

Hospitals Searching Pvch

Hospitals Searching Pvch

Hospitals searching pvch: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్, డైగ్నోస్టిక్ కేంద్రాల్లో వైద్యాధికారుల అధికారులు తనిఖీలు నిర్వహించారు. నల్లగొండ లో 6 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు అందించారు. 5 ల్యాబ్లు, ఒక ప్రైవేట్ ఆస్పత్రి సీజ్ చేసారు. ఆదిలాబాద్ లోని 3 ఆస్పత్రులకు నోటీసులు అందజేసారు. వరంగల్ , నారాయణపేట్ జిల్లాలో ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో 2 ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసారు. ములుగులో 3 ప్రైవేట్ ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు అందించారు అధికారులు. మరో వారం రోజుల పాటు కొనసాగనున్న తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read also: Ponniyin Selvan: టాలీవుడ్ ప్రముఖులూ మారండయా… మారండి…!

ఖమ్మం జిల్లా కేంద్రంలోని మెడికల్ దుకాణాలపై ఆసుపత్రులపై జిల్లా డ్రగ్స్ నియంత్రణ శాఖ దాడులు కొనసాగిస్తుంది. నగరంలోని ఆరాధ్య హాస్పిటలపై తనిఖీలు నిర్వహించారు. ఇటీవల వల్లభి వద్ద జమాల్ సాహెబ్ వివాహేతర సంబంధాల కేసులో, అదేవిధంగా ఖమ్మం నగరంలోని శశిబాల ఆసుపత్రిలో మరో ఘటన లో భార్యని కూడా మత్తు ఇంజక్షన్ల ద్వారా హత్య చేసిన విషయం తెలిసింది. ఈ రెండు ఘటనకు సంబంధించి మత్తు ఇంజక్షన్లు ఆరాధ్య హాస్పటల్ నుంచి వచ్చినట్లుగా స్పష్టం అయింది. దీంతో ఆరాధ్య హాస్పిటల్లో డ్రగ్స్ నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించి నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా నగరంలోని మత్తు ఇంజక్షన్లు అమ్మే మెడికల్ షాపులపై కూడా తనిఖిలు చేశారు ఆరాధ్య హాస్పిటల్లో మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వృధాగా ఉన్న దానిని కింద పడవేశారు. అలా వదిలేసిన మత్తుమందుని నిందితులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ తనిఖీలకు ప్రాధాన్యత ఏర్పడింది. తాము తనికిలు చేస్తున్నామని, ఆరాధ్య ఆసుపత్రికి నోటీసు కూడా జారీ చేసినట్టుగా డ్రగ్ ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు.
CBI’s Operation Meghchakra: పిల్లల లైంగిక దోపిడి కేసుపై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు

Show comments