Site icon NTV Telugu

Horrible incident: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య.. కారణం ఏంటంటే..

Horrible Incident

Horrible Incident

Horrible incident: సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో మహమ్మద్ మొససిద్ధికి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. మృతి చెందిన వ్యక్తిపై ఒక్కక్షణంలోనే అతికిరాతకంగా దాడిజరిపాడు.. మొససిద్దికి ఇంటికి మరోవ్యక్తి వచ్చాడు మాటలు కలిపి తీవ్రంగా మొససిద్దికిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాట మాట పెరిగింది. ఒక్కసారిగా అతని పై దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే దాడి చేయడం అతను అక్కడికక్కడే చనిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. అయితే స్థానిక సమచారంతో ఘటనాస్థలికి చేరుకున్నా పోలీసులు బార్కాస్ కు చెందిన మహమ్మద్ మొససిద్ధిను దిల్కుష్ నగర్ లోఫైజుద్దీన్ అనే వ్యక్తి హతమార్చినట్లు గుర్తించారు. 12 గజాల స్థలానికి సంబంధించిన వివాదంలో.. మూసా సిద్ధికి 50 లక్షల రూపాయలు ఇచ్చిన ఫయాజుద్దీన్ సమాచారం. అటు డబ్బులు ఇవ్వకపోగా ల్యాండు వివాదంగా మారడంతో ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. దిల్ కుష్ నగర్ లోని ఇంటికి రావాలని మూసా సిద్ధిఖీని పిలిపించిన ఫయాజుద్దీన్.. కళ్ళల్లో కారం కొట్టి అతన్ని పై దాడి చేసి హత్య చేసిన ఫయాజ్ దీంతో సిద్దీఖీని అక్కడికక్కడే మృతి చెందాడు. బోయిన్పల్లి పోలీసుల ఫయాజ్ ను అదుపులో తీసుకున్నారు. సిద్ధికి డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Revanth Reddy: ప్రగతిభవన్‌పై రేవంత్‌ కామెంట్స్.. బీఆర్‌ఎస్‌ నేతలు సీరియస్‌

అయితే.. మహమ్మద్ మొససిద్ధి పాతబస్తీలో నివసిస్తాడు. కాగా.. అతను కేఎంఆర్ ఇండియా హోమ్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే.. కేఎంఆర్ ఇండియా హోమ్స్‌లో ఫ్లాట్ల కొనుగోలుకు ఇప్పటికే చాలా మంది నగరవాసులు ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బు కట్టినట్లు సమాచారం. అయితే.. ఆ డబ్బులకు రశీదులను కూడా తీసుకోలేదట…ఇప్పుడు మూసా సిద్దిఖీ మరణించడంతో తమ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. మేమందరం రూపాయి రూపాయి కూడబెట్టి అప్పులు చేసి డబ్బులు కట్టామని తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. దీంతో.. కేఎంఆర్ ఇండియా హోమ్స్‌లో తమకు ఫాట్స్‌ వస్తాయా? కనీసం ఇచ్చిన డబ్బులైనా వెనక్కి ఇస్తారా? అనే దానిపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version