Site icon NTV Telugu

Home Voting: హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో నేడు, రేపు హోం ఓటింగ్‌..

Home Oting

Home Oting

Home Voting: నేడు, రేపు ఎన్నికల సిబ్బంది ఇంటింటి ఓటింగ్‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్‌లో 121 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 86 మంది సీనియర్ సిటిజన్లు, 35 మంది వికలాంగులు ఉన్నారు. ఇవాళ, రేపు (శుక్ర, శనివారాలు) ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటింటికి ఓటింగ్ నిర్వహించనున్నారు. ఓటర్లకు ఫోన్ చేసి, లేదా సమాచారం ఇచ్చి వారు అందుబాటులో ఉన్నప్పుడు ఎన్నికల సిబ్బంది బృందాలుగా ఆయా ఓటర్ల వద్దకు వెళ్లి.. ఇంటింటికి ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. కాగా, ఓటర్లందరూ అందుబాటులో ఉండాలని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి తెలిపారు.

Read also: Sabari Review: వరలక్ష్మీ శరత్ కుమార్ ‘శబరి’ రివ్యూ!

రాష్ట్రంలో గురువారం నుంచి లోక్‌సభ ఎన్నికలకు ఇంటి నుంచే ఓటు వేసే ప్రక్రియను ఎన్నికల అధికారులు ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శుక్ర, శనివారాల్లో సౌలభ్యాన్ని బట్టి ఒకే రోజు కాకుండా ఇంటింటికి ఓటింగ్ ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి ఓటు వేసేందుకు 23,248 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల అధికారులు ఇంటి ఓటింగ్‌ను 806 గ్రూపులుగా.. 885 రూట్లుగా విభజించారు. ప్రతి బృందంలో పోలింగ్ అధికారులతో పాటు వీడియో చిత్రీకరణ బృందం ఉంటుంది. ఈ నెల 6 గంటలలోగా ఇంటింటికి ఓటింగ్‌ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
Saudi Arab : సౌదీలో పోలీసుల కఠిన చర్యలు.. ఎవరైనా నేరం చేయాలంటే 10సార్లు ఆలోచించాల్సిందే

Exit mobile version