Site icon NTV Telugu

నేరేడుమేట్ లో హిజ్రాల హల్ చల్….

నేరెడుమేట్ లో హిజ్రాల హల్ చల్ సృష్టించారు. పెళ్లి వారి ఇంటికి వెళ్లి 50 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు…. ఇవ్వకపోతే బట్టలు విప్పి హంగామా చేస్తామని వారిని ఆందోళనకు గురి చేశారు. అంతేకాదు.. పెళ్లి వారిపై హిజ్రాలు దాడి చేశారు. దీంతో పోలీసులకు బాధితులు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన నేరేడు మెట్ పోలీసులు ఆ హిజ్రాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడి ఘటనతో ఆగకుండా ఆ హిజ్రాలు పోలీస్ స్టేషన్ లోనూ బట్టలు విప్పి హంగామా చేశారు. దీంతో హిజ్రాలపై 506, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే పోలీస్ స్టేషన్ లో న్యూ సెన్స్ క్రియేట్ చేసినందుకు ఐపిసి 188, 51(b) డిసాస్టర్ మనేజ్మెంట్ కింద మరో కేసు నమోదు చేశారు పోలీసులు.

Exit mobile version