Site icon NTV Telugu

Power Consume : తెలంగాణ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం..

రోజురోజుకు తెలంగాణలో విద్యుత్‌ వినియోగం పెరిగిపోతోంది. ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్తు సరఫరాతో ఇది మరింత అధికమవుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వేసవికాలం కారణంగా భానుడు వేడికి ఇంటి నుండి బయటకు అడుగుపెట్టాలేని పరిస్థితి వచ్చేస్తోంది.. దీంతో.. విద్యుత్ వినియోగం కూడా క్రమంగా పెరిగిపోతోంది. తెలంగాణలో ఈ రోజు ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది విద్యుత్ డిమాండ్.. ఈ విషయాన్ని తెలంగాణ ట్రాన్స్‌కో అండ్ జెక్సో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రకటించారు… ఇవాళ సాయంత్రం 3.54 నిమిషాలకు ఏకంగా 13,857 మెగా వాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు తెలిపారు.

రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యధిక విద్యుత్ డిమాండ్ అని, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇదే అత్యధిక విద్యుత్ వినియోగంగా నమోదైనట్లు పేర్కొన్నారు. 3 రోజుల క్రితం 13,742 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ కాగా ఇవాళ 13,857 మెగా వాట్లు నమోదైందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వ్యవసాయ రంగం, పరిశ్రమల స్థాపన, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతోనే విద్యుత్ డిమాండ్ పెరిగిందని, ఒకటి రెండు రోజుల్లోనే 14,000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ రావచ్చు అంటున్నారు విద్యుత్ అధికారులు.

https://ntvtelugu.com/agricultural-extension-for-rare-crops/
Exit mobile version