NTV Telugu Site icon

జమున హ్యాచరీస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ‌..

High Court TS

జమున హ్యాచరీస్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది.. హ్యాచ‌రీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాక‌రించింది.. మాసాయిపేట భూములపై హైకోర్టును ఆశ్ర‌యించిన ఈటల రాజేందర్ భార్య జామున.. సర్వే నోటీస్ ఇవ్వడానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారామె.. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. జ‌మున హ్యాచ‌రీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాక‌రించింది.. ఇక‌, విచార‌ణ సంద‌ర్భంగా.. కరోనా స‌మ‌యంలో సర్వేను కొన్ని రోజులు వాయిదా వేసేందుకు సిద్ధమన్న కోర్టుకు తెలిపారు ఏజీ.. అయితే, జూన్ రెండు లేదా మూడో వారంలో సర్వే చేయాలని తహశీల్దార్ ను హైకోర్టు ఆదేశించింది. కాగా, ఈనెల 5న సర్వే నోటీసు ఇచ్చారు అధికారులు..