NTV Telugu Site icon

ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం పై హైకోర్టు విచారణ…

TS High Court

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం పై టీఎస్ హైకోర్టు విచారణ విచారణ జరిపింది. ఇప్పటికే చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కేంద్రం అఫిడవిట్ ధాఖలు చేసింది. ఇక కేంద్రం ధాఖలు చేసిన అఫిడవిట్ పై కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసారు చెన్నమనేని. అయితే కౌంటర్ పిటిషన్ లపై ఇరు వాదనలు విన్న హైకోర్టు… సెక్షన్ 5 (1) f సిటిజన్ షిప్ యాక్ట్ 1955 చెన్నమనేని భారత పౌరసత్వం పొందడానికి అర్హుడాని కోర్టు కు తెలిపిన చెన్నమనేని తరపు న్యాయవాది.. ఎన్నికల్లో పాల్గొనడానికి పూర్తి అర్హత ఉందన్నాడు. ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచాడని కోర్టు కు తెలిపిన న్యాయవాది.. భారత పౌరుడిగా ఉండి జర్మనీ వెళ్లి వచ్చాడని తెలిపారు.

అయితే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని కోర్టుకు తెలిపాడు ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది.. ఇప్పటి కూడా చెన్నమనేని రమేష్ జర్మనీ లో ఉన్నాడన్న పిటీషనర్ తరపు న్యాయవాది.. భారత ప్రభుత్వానికి ఓసిఐ కార్డ్ కోసం అప్లయ్ చేశాడని… కేంద్ర హోమ్ శాఖ కూడా చెన్నమనేని జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నట్లు తెలిపిందన్నాడు న్యాయవాది. ఇక ప్రస్తుతం వర్చువల్ కోర్ట్ నడుస్తున్న నేపథ్యంలో ఫిజికల్ కోర్టు లో పూర్తి వాదనలు వినిపిస్తామన్నారు చెన్నమనేని తరపు న్యాయవాది. అలాగే తదుపరి విచారణను ఆగష్టు 10 కి వాయిదా వేసింది హైకోర్టు.