కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ టూర్‌పై నిర్ణయాన్ని వీసీకే వదిలేసింది హైకోర్టు.. రెండు రోజుల క్రితం పిటిషన్‌ను పరిశీలించాలంటూ వీసీని ఆదేశించిన సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే, వీసీ సెలవులో ఉండడంతో.. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై సందిగ్ధత నెలకొంది.
Read Also: Konda Vishweshwar Reddy: బండితో కొండా భేటీ.. బీజేపీలో చేరతారా?
కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించాల్సి ఉంది.. తన పర్యటనలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొనేలా కాంగ్రెస్ ప్లాన్ చేసింది. కానీ, ఆంక్షల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్.. రాహుల్ టూర్‌కు అనుమతి నిరాకరించారు. ఈ విషయమై ఇదివరకే తెలంగాణ కాంగ్రెస్.. హైకోర్టును ఆశ్రయించగా, తుది నిర్ణయం వీసీదేనని హైకోర్టు స్పష్టం చేసింది.. ఇక, తాజాగా, ఎన్‌ఎస్‌యూ హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాహుల్ పర్యటనకు అనుమతి ఇచ్చేలా వీసీని ఆదేశించాలని కోరింది. ఈ మేరకు పిటిషన్‌పై విచారణ న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేస్తూ.. వీసీదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. దీంతో, కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైనట్టు అయ్యింది.