NTV Telugu Site icon

Rain Alert: హైదరాబాద్‌ కు భారీ వర్ష సూచన.. ప్రజలకు జీహెచ్‌ఎంసీ హెచ్చరిక…

Hyderabad Rain Alert

Hyderabad Rain Alert

Rain Alert: హైదరాబాద్‌ను వర్షం ముంచెత్తింది. ఇవాళ ఉదయం నుంచి పలుచోట్ల భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు హైదరాబాద్‌లో మరో రెండు గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ సూచించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ 040-21111111, 9000113667ను సంప్రదించండి. కాగా, తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఉదయం 6.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో 120 మి.మీ వర్షం నమోదైంది. పలుచోట్ల 80 నుంచి 120 మి.మీ. వర్షపాతం నమోదైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, కొంపల్లి, మాదాపూర్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్‌బీనగర్, నాగోల్, అల్కాపురి, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీ వర్షం కురిసింది.

Read also: MLC Kavitha: నేడు సుప్రీం కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..

మలక్‌పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, నాగారం, కుత్బుల్లాజీ హైదర్‌నగర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్‌, ముషీరాబాద్‌, రాంనగర్‌, పార్సీగుట్ట, బుద్ధనగర్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వరద ఉధృతికి ఓ వ్యక్తి బైక్‌తోపాటు కొట్టుకుపోయిన ఘటన రాంనగర్‌లో చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు అతన్ని నీటిలో నుండి బయటకు తీశారు. చాలా చోట్ల మోకాళ్ల లోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మలక్‌పేట రైల్వేస్టేషన్‌లో ఆర్‌ఓబీ ఉప్పొంగడంతో ఇరువైపులా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మలక్‌పేట రైల్వేస్టేషన్‌ నుంచి ముసారాంబాగ్‌, సంతోష్‌నగర్‌, కోఠి వైపు చాదర్‌ఘాట్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీ రోడ్డుపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Jaganmatha Stotram: శ్రావణ మంగళవారం జగన్మాత స్తోత్రాలు వింటే 100 రెట్ల ఫలితాన్ని పొందుతారు

Show comments