Tank Bund: తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న అమ్మవారి విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో వినాయక నిమజ్జనాలను తలపించే విధంగా భారీ స్థాయిలో దుర్గా మాత వాహనాలు టాంక్ బండ్ పై భారీగా తరలి వచ్చాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ సెకరటేరియట్ రోడ్, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, టెలిఫోన్ భవన్ రోడ్ వరకు పూర్తిగా వాహనాలు నిలిచిపోయాయి. నిమజ్జన వాహనాలతో నిండిపోయిన టాంక్ బండ్ పరిసరాలన్నీ కిక్కిరిపోయాయి. పండగ తరువాత అంతా ఆఫీస్ లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ కావడంతో తో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కాగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఇంకా ట్యాంక్ బండ్ లో దుర్గామాత నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సిటీ లో ఈసారి దాదాపు 3వేలకు పైగా అమ్మవారి విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్దకు తరలివచ్చాయి. ఇప్పటివరకు దాదాపు 1500 నుంచి 2000 విగ్రహాలు నిమజ్జనం పూర్తైంది. గత మూడు రోజుల నుంచి నిమజ్జనం కొనసాగుతుంది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున్న నిమజ్జనం కోసం టాంక్ బండ్ పై దుర్గామాత విగ్రహాలు తరలివస్తున్నాయి. నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ చుట్టూ 11 క్రెన్ ల ఏర్పాటు చేశారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర భారీగా విగ్రహాలు క్యూ కట్టారు.
దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా 23 నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మార్గ్, గార్డెన్ పాయింట్, జలవిహార్‌లోని బేబీ పాండ్స్, సంజీవయ్య పార్కులో విగ్రహాల నిమజ్జనం జరగనున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు విధించారు. దుర్గామాత విగ్రహాల తరలింపు సమయంలో ట్రాఫిక్ పరిస్థితులను బట్టి ఎల్లప్పుడూ నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే టాంక్ బండ్ పై నిన్నటి నుంచి దుర్గామాత విగ్రహాలు నిమజ్జనానికి భారీగా చేరడంతో పరిసర ప్రాంతాలన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ ను మళ్లించేందుకు అధికారులు పెద్ద సమస్యగా మారింది.
Meenaakshi Chaudhary: శారీ అందాలతో మతి పొగుడుతున్న మీనాక్షి చౌదరి..