Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Heavy Traffic Jam On Hyderabad Tank Bund

Tank Bund: టాంక్ బండ్ పై ట్రాఫిక్ జామ్‌.. దుర్గామాత వాహనాలతో నిండిన పరిసర ప్రాంతాలు..

Published Date :October 26, 2023 , 11:37 am
By Bhanu
Tank Bund: టాంక్ బండ్ పై ట్రాఫిక్ జామ్‌.. దుర్గామాత వాహనాలతో నిండిన పరిసర ప్రాంతాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tank Bund: తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న అమ్మవారి విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో వినాయక నిమజ్జనాలను తలపించే విధంగా భారీ స్థాయిలో దుర్గా మాత వాహనాలు టాంక్ బండ్ పై భారీగా తరలి వచ్చాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ సెకరటేరియట్ రోడ్, నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, టెలిఫోన్ భవన్ రోడ్ వరకు పూర్తిగా వాహనాలు నిలిచిపోయాయి. నిమజ్జన వాహనాలతో నిండిపోయిన టాంక్ బండ్ పరిసరాలన్నీ కిక్కిరిపోయాయి. పండగ తరువాత అంతా ఆఫీస్ లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ జామ్ కావడంతో తో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

కాగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఇంకా ట్యాంక్ బండ్ లో దుర్గామాత నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సిటీ లో ఈసారి దాదాపు 3వేలకు పైగా అమ్మవారి విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్దకు తరలివచ్చాయి. ఇప్పటివరకు దాదాపు 1500 నుంచి 2000 విగ్రహాలు నిమజ్జనం పూర్తైంది. గత మూడు రోజుల నుంచి నిమజ్జనం కొనసాగుతుంది. ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున్న నిమజ్జనం కోసం టాంక్ బండ్ పై దుర్గామాత విగ్రహాలు తరలివస్తున్నాయి. నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ చుట్టూ 11 క్రెన్ ల ఏర్పాటు చేశారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గర భారీగా విగ్రహాలు క్యూ కట్టారు.

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా 23 నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ మార్గ్‌, గార్డెన్‌ పాయింట్‌, జలవిహార్‌లోని బేబీ పాండ్స్‌, సంజీవయ్య పార్కులో విగ్రహాల నిమజ్జనం జరగనున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు విధించారు. దుర్గామాత విగ్రహాల తరలింపు సమయంలో ట్రాఫిక్ పరిస్థితులను బట్టి ఎల్లప్పుడూ నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే టాంక్ బండ్ పై నిన్నటి నుంచి దుర్గామాత విగ్రహాలు నిమజ్జనానికి భారీగా చేరడంతో పరిసర ప్రాంతాలన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ ను మళ్లించేందుకు అధికారులు పెద్ద సమస్యగా మారింది.
Meenaakshi Chaudhary: శారీ అందాలతో మతి పొగుడుతున్న మీనాక్షి చౌదరి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • heavy traffic jam
  • Heavy traffic jam on Hyderabad Tank Bund
  • Hyderabad Tank Bund
  • Vehicles of Mother Durga

తాజావార్తలు

  • CM Revanth Reddy: మా రాష్ట్రంకి వచ్చి చూడండి.. పినరయ్ విజయన్‌కు సీఎం రేవంత్ సవాల్!

  • Vijay Devarakonda : రణబాలి ఫైట్ సీన్ లీక్.. దేవరకొండ విశ్వరూపం!

  • Amit shah: 15 రోజులు బెంగాల్లోనే ఉంటా.. మమత సర్కార్‌ను గద్దె దించుతామని సవాల్

  • Supreme Court: ‘సర్’ అధికారుల్ని బంధిస్తారా? బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

  • Lakshmi Manchu: ఆ విషయంలో నా భర్త జంకుతాడు..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions