Site icon NTV Telugu

TS Police: 2300 మంది పోలీసులతో భారీ బందోబస్తు.. అక్కడకు వెళ్లాలంటే కష్టమే..

Ts Police

Ts Police

TS Police: నేడు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈనేపథ్యంలో అమర వీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవానికి 2300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులతో భద్రత నిర్వహిస్తున్నారు. లా అండ్ ఆర్డ్‌ తో పాటు 41 ప్లటూన్ల ఏఆర్‌, 10 ప్లటూన్ల టిఎస్‌ఎస్పీ, మరో 10 ప్లటూన్ల క్విక్ రెస్పన్స్ టీమ్ లు ఏర్పాటు చేశారు. విధుల్లో 800 మంది ట్రాఫిక్ సిబ్బంది ఉంటారు. ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంక్షలు విధించారు. మద్యాహ్నం 3గం నుంచి రాత్రి 10గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. నేడు ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్ ఘాట్‌, లుంబిని పార్క్, నక్లెస్ రోడ్‌ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల ఇబ్బందులు కలగకుండా ప్రత్యామార్గాలు ఏర్పాటుచేశారు.

Read also: Bhatti Vikramarka : భట్టిని పరామర్శించిన పొంగులేటి

సాయంత్రం 6.30 నిమిషాలకు అంబేద్కర్ విగ్రహం నుండి స్మారక చిహ్నం వరకు 6000 మంది కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రాంగణానికి చేరుకుంటారు. 12 తుపాకులతో అమరవీరులకు తుపాకీ నివాళులర్పించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అమరజ్యోతిని సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత శిఖరాగ్రానికి చేరుకుంటారు. అసెంబ్లీలో అమరవీరులకు నివాళులర్పిస్తూ ప్రముఖ కార్యకర్త, ఎమ్మెల్సీ దేశపతి పాట పాడనున్నారు. అసెంబ్లీలో కొవ్వొత్తులు ప్రదర్శించి 10 వేల మంది అమరవీరులకు నివాళులర్పిస్తారు. అనంతరం సీఎం ప్రసంగించనున్నారు. ఎంపికైన ఆరుగురు అమర వీరుల కుటుంబాలకు నివాళులర్పిస్తారు. 800 డ్రోన్‌లతో ప్రదర్శన , అమరవీరుల కోసం జోహార్ అనే అక్షరాలతో స్మారక చిహ్నంపై లేజర్ షో ఏర్పాటు చేశారు.
Salaar: మైసూర్ డాన్ గా ప్రభాస్? KGF 2 లోనే హింట్?

Exit mobile version