NTV Telugu Site icon

ఏపీ తెలంగాణ బోర్డర్ లో ఆంక్షలు కఠినం…భారీగా నిలిచిన వాహనాలు

తెలంగాణ‌లో క‌రోనా కేసులు పెరుగుతున్న స‌మ‌యంలో లాక్‌డౌన్ ను విధించారు.  ఉదయం 10 గంట‌ల నుంచి లాక్‌డౌన్ అమ‌లులో ఉండ‌టంతో తెలంగాణ నుంచి వేలాదిమంది ఏపీకి వెళ్తున్నారు.  భారీ సంఖ్య‌లో వాహ‌నాల్లో ప్ర‌జ‌లు త‌ర‌లి వెళ్తున్నారు.  ఏపీలో మ‌ద్యాహ్నం 12 గంట‌ల త‌రువాత క‌ర్ఫ్యూ అమ‌లులో ఉండ‌టంతో 12 గంట‌ల‌లోగా సొంత ప్రాంత‌ల‌కు చేరుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  ఉద‌యం 10 గంట‌ల తరువాత లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంది కాబ‌ట్టి ఉద‌యం 10 గంట‌ల త‌రువాత వాహ‌నాల రాక‌పోకలు ఆగిపోనున్నాయి.  ఉద‌యం ప‌ది గంట‌ల త‌రువాత తెలంగాణ బోర్డ‌ర్‌ల‌లో చెక్ పోస్టుల వ‌ద్ద ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయ‌బోతున్నారు.  దీంతో ప్ర‌స్తుతం చెక్ పోస్టుల వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో వాహ‌నాలు ఆగిపోయాయి.  అయితే, ఏపీ నుంచి హైద‌రాబాద్ కు వెళ్లే అంబులెన్స్ ల‌ను పోలీసులు వ‌దిలేస్తున్నారు.  హైకోర్డు ఆదేశాల‌తో అంబులెన్స్ ల‌ను అడ్డుకోవ‌డం లేద‌ని అంటున్నారు.