NTV Telugu Site icon

Heavy Rain Telangana: తెలంగాణాలో దంచికొడుతున్న వానలు.. జిల్లాల్లకు భారీ వర్ష సూచన

Heavy Rain Telangana

Heavy Rain Telangana

Heavy Rain Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండురోజుల పాటు మళ్ళీ వారణుడు తన ప్రతాపాన్ని చూపనున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వానతో పాటు కొన్నిచోట్ల పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఈవర్షాలకు కారణమని వివరించింది. అయితే.. దీని ప్రభావంతో ఈ నెల10 వరకు చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో రెండురోజులుగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఇవాళ ఆరు జిల్లాల్లో అతి భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఇక, మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్‌ను ప్రకటించింది…వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేఅవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని జుంటుపల్లి వాగు పొంగిపొర్లుతుంది. మండలంలోని యెక్కేపల్లి నుంచి పెర్కంపల్లి వెళ్లే గ్రామానికి వెళ్లే దారిలో బ్రిడ్జ్ పనులు కొనసాగుతుండడంతో పక్కనే తాత్కాలిక రహదారి నిర్మించినప్పటికీ వాగు ఉధృతికి పూర్తిగా తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దీంతో యెక్కేపల్లి, పెర్కంపల్లి గ్రామాలకు మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. తాండూర్ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకోనిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, చొప్పడండి మనకొండూర్ నియోజకవర్గముల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తుంది. పలు చోట్ల రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.
Arun Bali passes away: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్‌ నటుడు కన్నుమూత..