NTV Telugu Site icon

వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 4 రోజులు భారీ వర్షాలు

rain

rain

గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్ష బీభత్సవానికి హైదరాబాద్‌ అతలాకుతలం అవుతోంది… ఈ నేపథ్యంలో.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.. రాగల 4 రోజులపాటు భారీ నుంచి అతి భారీవర్షాలు పడతాయని పేర్కొంది.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మహబూబాబాద్, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, భువనగిరి, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉండగా.. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలింది వాతావరణ కేంద్రం.. ఇక, ఈ నెల 6వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులున్నాయని, అది వాయుగుండంగా మారొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా, దండికొడుతున్న వానలతో హైదరాబాదీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. నిన్న మధ్యాహ్నం కురిసన వర్షానికి వాహనదారులు అల్లాడిపోగా.. రాత్రి కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.. దీంతో.. లోతట్టు ప్రాంతల ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది.