NTV Telugu Site icon

AP-TG Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు ఫుల్‌ వానలే..

Ap Telangana Rains

Ap Telangana Rains

AP-TG Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉంది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం ద్వారా సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు నుండి 5.8 కి.మీ మధ్యలో కొనసాగుతుంది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మీదుగా వాయుగుండంగా బలపడిన అల్పపీడనం నేడు వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది.

Read also: Telangana: దంచికొడుతున్న వానలు.. ఉప్పొంగుతున్న ప్రాజెక్టులు

మరో వైపు తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉండగా.. పది జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచి మళ్లీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు వర్షం కురుస్తుంది. ఉదయం 10 గంటల తర్వాత వర్షం పెరుగుతుంది. హైదరాబాద్, ఉత్తర, పశ్చిమ తెలంగాణలో సాయంత్రం 5 గంటల తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో రాత్రి 9 గంటల తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌లో నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వర్షం కురుస్తోంది.

Read also: Holidays: ఏపీలో భారీ వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు..

ఇక హైదరాబాద్, కామారెడ్డి, కొమరం భీం, మెదక్, ఎన్.మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Read also: Manipur : మణిపూర్‌లో భద్రతా దళాలు చర్యలు.. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

ఏపీలోని రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్, పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ ప్రకటించింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
Live Suicide : వాటర్ ట్యాంక్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధి.. వీడియో వైరల్..