Site icon NTV Telugu

Hyderabad Weather Report: అలర్ట్​.. నేటి నుంచి మూడురోజులు భారీ వర్షాలు

Hyderabad Weather Report

Hyderabad Weather Report

Hyderabad Weather Report: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రెడ్‌ అలర్ట్‌ హెచ్చరికల జారీ చేసామని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకులు నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడటంతో.. రాష్ట్రంలో ఆదివారం మరింత తీవ్రమయ్యే సూచనలున్నాయి. కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రెడ్‌ అలర్ట్‌ హెచ్చరిక చేసారు అధికారులు.

read also: Police SI Exams Prelims: నేడు ఎస్సై ప్రిలిమ్స్‌ పరీక్ష.. హాల్‌ టికెట్‌ పై అదివుండాల్సిందే..

అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిమీ ఎత్తు వరకూ వ్యాపించింది. దీంతో ఈ ప్రభావం తెలంగానలో ఆది, సోమ వారాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావం జిల్లాల్లో కొద్ది గంటల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, వర్షాలు పడే సమయంలో గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా అక్కనపల్లి, మంచిర్యాలలో 9.2, కుమురంభీం జిల్లా వంకులం 7.3, కరీంనగర్‌ జిల్లా అర్నకొండ లో 6.1, ఖమ్మం జిల్లా కారేపల్లి లో 5.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో ఉష్ణోగ్రత సాధారణం కన్నా 3 డిగ్రీల వరకూ తగ్గడంతో చల్లని వాతావరనం ఏర్పండింది. ఇక శనివారం రాత్రి నగరంలో భారీ వర్షం కురిసింది.

Exit mobile version