NTV Telugu Site icon

Crop destruction: రైతులను ముంచేసిన వర్షం.. జిల్లాల వారిగా పంట నష్టం

Crop Destruction

Crop Destruction

Crop destruction: రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. గత నెల రోజులుగా తన ప్రతాపాన్ని చూపించిన భానుడు.. వరుణ దేవుడు పలకరించడంతో కాస్త చల్లబడ్డాడు. గత రెండు రోజులుగా విస్తారంగా పడుతున్న వర్షాలకు రోడ్లు, డ్రైనేజీల్లో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కుండపోతగా పడిన వర్షాలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో కొందరికి ఎంతో హాయిగా ఉన్నా.. కొందరు నిరాశ్రేయులు అవగా, అకాల వర్షాలకు తోడు వడగళ్లతో ఎంతోమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read also: CM YS Jagan Review: అకాల వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా గంట పాటు గులకరాళ్ల సైజులో వడగండ్లు పడి వరి పంటలు, తోటలు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులు వీచి పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. పొట్ట దశలో ఉన్న వరి పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్‌, గోవిందరావుపేట మండలాల్లో, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రం, గణపురం మండల కేంద్రంలో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో రహదారిపై రాళ్లు కుప్పలుక్పులుగా పడ్డాయి. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో పెంకుటిండ్లు, వరి పంటలు దెబ్బతిన్నాయి. జనగామ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రాత్రి కురిసిన గాలి వానకి గ్రేటర్ వరంగల్ పలు రేకుల ఇండ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. కరిమాబాద్, ఖిలా వరంగల్ లో ఇంటి పైన వేసిన రేకులు కొట్టుకొని పోవడం జనం ఇబ్బందులు పడ్డారు.

వరంగల్ జిల్లాలో గత రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో నర్సంపేట నియోజకవర్గం లోని ఖానాపురం నెక్కొండ నర్సంపేట నల్లబెల్లి దుగ్గొండి, చెన్నారావుపేట మండలాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. వడగళ్ల వానకు మొక్కజొన్న తో పాటు వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి, గ్రామాల్లోని రేకుల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని చిన్న ఎల్లాపురం సమీపంలోని హాము తండాలో గత రాత్రి వడగళ్ల వాన పడుతుండగా ఓ ఇంట్లో తలదాచుకున్న ఇద్దరు రైతులపై చెట్టు కూలడంతో ధరం సోది శంకర అనే రైతు అక్కడికక్కడే మృతి చెందగా మరో రైతు జర్పుల కిరియకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మహబూబాబాద్ డివిజన్లోని గంగారం, కొత్తగూడ, గూడూరు మండలాల్లో మొక్కజొన్న తో పాటు మిరప, వరిచెల్లు దెబ్బతిన్నాయి.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక, ఇళ్లందకుంట మండల్లాలో శనివారం రాత్రి వడగండ్ల వాన కురియడంతో మిర్చిపంట,మొక్కజొన్న, వరి, పంటలు మొత్తం నేలకొరిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చే టైమ్ లో వడగండ్ల వర్షంతో భారీగా నష్టం వచ్చిందని తెలిపారు. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్ధితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్ట పోతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతే రాజు అంటున్నారు. కానీ రైతులకు నష్టం జరిగితే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోక పోవడం శోచనీయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.  తిమ్మాపూర్ మండలం నుస్తులపూర్ లో అకాల వర్షానికి 30 గొర్రెలు మృతి చెందారు. సుమారు మూడు లక్షల రూపాయల నష్టం వాటిలిందని గొర్రెల కాపరులు ఆందోళన చెందుతున్నారు.

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వరుణుడి బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులుతో కూడిన వర్షంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో కల్లాల్లో మిర్చి తడిసి ముద్దయ్యాయి. వర్షానికి తడిసి మిరప నాణ్యత కోల్పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భద్రాద్రి జిల్లాలో భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బుర్గంపహాడ్‌ లలో బారి వర్షాలకు మొక్క జొన్న, మిర్చి పంటలు దెబ్బ తిన్నాయి. భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకల ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. చలువ పందిళ్ళు వేయటానికి ఇబ్బంది ఎదురైంది. ఇల్లందు సింగరేణి ఏరియాలో అకాల వర్షంతో బొగ్గు ఉత్పత్తి తగ్గింది. ఇల్లందు ఉపరితల గని, కోయగూడెం ఉపరితల గనిలో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నిలిచిన 20 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు చేపట్టారు. ఇల్లందు ఉపరితల గని ప్రాంతంలో 64.38 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం. సంగారెడ్డి జిల్లాలో చేతికొచ్చిన పంట నెలపాలైంది. సుమారు 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, శనగ, ఆలు, మామిడి, బొప్పాయి పంటలకు నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లాలో పలు చోట్ల మొక్కజొన్న పంట నెలకొరిగాయి. సిద్దిపేట జిల్లా తొగుటలో పొద్దు తిరుగుడు పంటకి తీవ్ర నష్టం వాటిల్లింది.

జగిత్యాల జిల్లా రాత్రి జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి జగిత్యాల రూరల్, అర్బన్, రాయికల్ మండలాల్లో మొక్కజొన్న నేల వాలింది. కల్లాల్లో పసుపు తడిసి ముదైంది. రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లావ్యాప్తంగా 4000 ఎకరాల్లో నేల వాలిన మొక్కజొన్న, కల్లాల్లో తడిసిన సుమారు 5 క్వింటాల్ల పసుపుకొమ్ములు. పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకుంటున్నారు.

నిజమాబాద్ జిల్లాలో వడగండ్ల వర్షం పంటకు నష్టం వాటిల్లింది. బీర్కూర్, మేనూరు, నర్సాపూర్, రామారెడ్డి, మోస్రా, జుక్కల్, నస్రుల్లా బాద్, ముగ్ధుపూర్ లో వడగండ్ల వాన భీభత్సం సృష్టించింది. 200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ. మాలాపల్లిలో పిడుగుపాటుకు ముగ్గురు విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. మార్కెట్ లో పసుపు బస్తాలు తడిసి ముద్దయ్యాయి. కోత దశ లో ఉన్న పంటలకు అకాల వర్షంతో తీవ్ర నష్టానికి గురిచేసింది.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు రైతుల పంటలను దెబ్బతీసాయి. నిన్న పలు చోట్ల వడగళ్ల వాన, రాత్రి బోథ్ , కడెం ఇచ్చోడ మండలాల్లో భారిగా వడగళ్ళకు మొక్క జొన్న పంట, గోధుమ, నువ్వు పంటలకు నేలవాలాయి దీంతో తీవ్ర నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు. పలు మండలాల్లో రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురియడంతో.. అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కనికరించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
Errabelli Dayakar Rao : నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

Show comments