తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం భారీ వర్షాలు కురిసే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని తెలిపింది. మంచిర్యాల, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, సంగారెడ్డి, పెద్దపల్లి, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు వున్నట్లు పేర్కొన్నారు.
పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణకేంద్రం హెచ్చిరికలు జారీ చేసింది. ఇక నగరంలో ఆదివారం తెల్లవారు జామునుంచే వాన జల్లులు కురుస్తున్నాయి. నిన్న శనివారం నుంచి హైదరాబాద్‌లోని పలు చోట్లు భారీ వర్షాలు కురిసింది.
ఈ నేపథ్యంలో వానలతో సమస్యల పరిష్కారానికి అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని, నాలాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాన్‌సూన్ యాక్షన్ టీమ్‌లు అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉండి ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆమె కోరారు.
ట్విటర్, ఫోన్ కాల్స్, ప్రజా ఫిర్యాదులు స్వీకరించి సమస్యను సత్వరమే పరిషరించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లో నీరు ప్రవేశిస్తే వెంటనే తొలగించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, పరికరాలు అందుబాటులో వుంచుకోవాలని, కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్లను మేయర్ ఆదేశాలు జారీ చేశారు.
Gujarat Riots Case: గుజరాత్ అల్లర్ల కేసు.. సామాజిక కార్యకర్త సెతల్వాద్ అరెస్ట్