Site icon NTV Telugu

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో భారీ వర్షం.. ఎక్కడ ఎంత అంటే..?

రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది.. కొన్ని ప్రాంతాల్లో 14 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది.. నల్లగొండ, సూర్యాపేట, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి… అత్యధికంగా సూర్యాపేట జిల్లా ఎర్కరాంలో 14.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో 11.7 సెంటీ మీటర్లు, మేడ్చల్ జిల్లా కాప్రాలో 11.6 సెం.మీ., రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 9 సెం.మీ. నమోదు అయ్యింది..

Read Also: యూపీ పోల్: కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన అఖిలేష్‌ యాదవ్

మరోవైపు.. హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది… నాచారంలో 11.3 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదు కాగా.. ఉప్పల్ చిలకానగర్‌లో 10 సెంటీ మీటర్లు, ఉప్పల్ మారుతి నగర్‌లో 9.6 సెంటీమీటర్లు, ఎల్బీనగర్‌లో 7.8 సెంటీ మీటర్లు, సరూర్ నగర్ అల్కాపురి కాలనీ లో 9.2 సెంటీ మీటర్లు, మల్కాజిగిరిలో 6.6 సెంటీ మీటర్లు, అస్మాన్‌ఘడ్ మలక్‌పేటలో 5.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరోవైపు.. ఇవాళ కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.

Exit mobile version