Heavy Rains Hyderabad: మూడు రోజుల నుంచి తెలంగాణలో వానలు భీభత్సం సృష్టించాయి. మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దైంది. ఉదయం మంచుదుప్పటి కమ్ముకున్న నగరం మధ్యాహ్నం వానతో నగరాన్ని ముంచెత్తింది. దీంతో పలు చోటు అధిక వర్షపాతం నమోదైంది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వానదారులు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. నిన్న సాయంత్రం నుంచి వాన దంచి కొట్టడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. రహదారులు స్తంబించడంతో రోడ్లమీదే వేచి వుండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవాళ, రేపు భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఉదయం మంచుదుప్పటితో ప్రజలకు ఊటిని తలపించిన వాతావరణం ఇవాళ ఒక్కసారిగా చల్లగా మారింది. మధ్యాహ్నం నుంచి వాన దంచి కొట్టంది. దీంతో.. బంజారాహిల్స్, లక్డికపూల్, అసెంబ్లీ, సచివాలయం, నాంపల్లి, కోఠి, సికింద్రాబాద్, మాధాపూర్, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, బేగంపేట, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, గోషామహల్, అబిడ్స్, సుల్తాన్ బజార్, అంబర్పేట్, బషీర్‌బాగ్, అఫ్జల్ గంజ్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగీ, మెహదీపట్నం, కార్వాన్, మాసబ్ ట్యాంక్, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో వరుణుడు చెలరేగిపోయాడు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Ekta Kapoor: నిర్మాత ఏక్తా కపూర్‌కి అరెస్ట్ వారెంట్.. ఆ బూతు సిరీసే కారణం!
