NTV Telugu Site icon

Weather Report: లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..

Wether Report

Wether Report

Weather Report: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26 సాయంత్రం నాటికి ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుండడంతో హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా.. ఇది ఈశాన్య దిశగా పయనించి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారినప్పటికీ.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఎలాంటి ముప్పు లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Read also: Vijaysai Reddy: చంద్రబాబును చూస్తుంటే జాలి వేస్తుంది.. పాపం..!

అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షంతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. వాయుగుండంగా మారనున్న బలమైన అల్పపీడనం కారణంగా రెండు రోజుల్లో కోస్తంహ్రా తీర ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఇక.. ఈదురుగాలుల ప్రభావంతో కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలోని పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. అలాగే.. శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు పలు జిల్లాల్లోని శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మరియు ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయి.

Show comments