Heavy Rain: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలు సోమవారం నాటికి తగ్గుముఖం పట్టినా ముసురు మాత్రం ఎడతెరిపి లేకుండా పోతోంది. సోమవారం రాత్రి 9 గంటల వరకు నగరంలోని నాగోల్‌లో అత్యధికంగా 1.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తీరం దాటిన వాయుగుండం 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. కాగా.. నేటి నుంచి వచ్చే 4 రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఈరోజు కూడా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read also: Rahul Gandhi: హర్యానా ఎన్నికల్లో ఆప్‌తో పొత్తుపెట్టుకునేందుకు రాహుల్ గాంధీ ఆసక్తి..
సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
మరోవైపు ఏపీ, తెలంగాణలకు భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో మూడు రోజుల్లో మరో ముప్పు వుందని వాతావరణ శాఖ హెచ్చరింది. అంటే సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ద్రోణి రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి తెలంగాణ మీదుగా కొనసాగుతుందని అధికారులు వివరించారు. కోస్తాంధ్ర కోస్తాకు అతి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Vijayawada Floods: వరద బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం.. ప్రతి ఒక్కరూ మళ్లీ సాధారణ జీవితం గడిపేలా చర్యలు..