Heavy Rainfall in Telangana: తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అప్పపీడనం కొనసాగుతుంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న ఈతీవ్ర అల్పపీడనం, రాగట 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండంగా మారిన తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గడ్ మీదుగా ప్రయాణించే ఛాన్స్ ఉందని వెల్లడించింది. తీరం వెంబడి బలంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తరోస్తా జిల్లాలు, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని నేడు, రేపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే సముద్ర తీర ప్రాంతాల వారు, మత్స్యకారులు నాలుగు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
కుమురం భీం ప్రాజెక్ట్ ముప్పు
వానల ధాటికి జిల్లాలోని ప్రముఖ కుమురం భీం ప్రాజెక్ట్ ముప్పు పొంచి ఉంది. జలాశయం ఆనకట్టకు పగుళ్లు రావడంతో ప్రమాదంగా మారింది. అయితే, ప్రాజెక్ట్‌కు ముప్పు పొంచి ఉండటంతో దిగువ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
read also: Astrology: ఆగస్ట్ 09, మంగళవారం, దినఫలాలు
గత మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇల్లలో నీరు చేరాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇవాళ భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను సైతం జారీ చేసింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నాంపల్లి , అబిడ్స్ , కోఠి , బషీర్బాగ్ , నారాయణగూడ , గోషామహల్ , అఫ్జల్ గంజ్ , మంగళహట్ , బేగంబజార్ , మలక్ పేట్, సైదాబాద్ , యాకుత్పురా, చార్మినార్, కార్వాన్ లలో భారీగా వర్షం కురిసింది. అయితే ప్రజలు బయటికి రావద్దని అత్యవసర ప్రయాణాలు ఉంటే తప్ప బయటకి రావద్దని సూచించారు.
Bihar Politics: బీజేపీతో సీఎం నితీష్ కుమార్ తెగదెంపులేనా.. నేడు జేడీయూ కీలక సమావేశం
