Hyderabad Heavy Rains: తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇటు మరో మూడురోజులు భారీ వర్షాలు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Read also: New Mandals in Telangana: రాష్ట్రంలో కొత్త రెవెన్యూ మండలాలు.. తుది నోటిఫికేషన్ జారీ
నగరంలో కొద్దిరోజులుగా వాతావరణం చల్లగా మారింది. ఉదయం మంచుదుప్పటితో ప్రజలకు ఊటిని తలపించింది. ఇక నిన్నటి నుంచి ఒక్కసారిగా చల్లగా మారిన వాతావరణ. మధ్యాహ్నం నుంచి చినుకులతో తడిపించి, సాయంత్రం వాన దంచి కొట్టంది. దీంతో.. బంజారాహిల్స్, లక్డికపూల్, అసెంబ్లీ, సచివాలయం, నాంపల్లి, కోఠి, సికింద్రాబాద్, మాధాపూర్, అమీర్‌పేట, ఎస్సార్ నగర్, బేగంపేట, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, గోషామహల్, అబిడ్స్, సుల్తాన్ బజార్, అంబర్పేట్, బషీర్‌బాగ్, అఫ్జల్ గంజ్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, నార్సింగీ, మెహదీపట్నం, కార్వాన్, మాసబ్ ట్యాంక్, మల్లేపల్లి తదితర ప్రాంతాల్లో వరుణుడు చెలరేగిపోయాడు. సాయంత్రం 5 గంటలకు మొదలైన వాన.. రాత్రి 8 గంటల వరకూ కురుస్తూనే ఉంది.. కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇళ్లకు చేరే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
జోరుగా వాన కురవడంతో.. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఈ దెబ్బకు ట్రాఫిక్ జామ్ నెలకొంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక గ్రేటర్ వ్యాప్తంగా 8.6 సెం.మీ, మెహిదీపట్నంలో 8.3సెం.మీ, ఖైరతాబాద్‌లో 7.5సెం.మీ, సరూర్ నగర్‌లో 7.2సెం.మీ, రాజేంద్రనగర్‌లో 6.4సెం.మీ, హిమాయత్ నగర్‌లో 6.3సెం.మీ, ఆసిఫ్‌నగర్‌లో 6.2 సెం.మీ, బండ్లగూడ కందికల్‌గేట్‌లో అత్యల్పంగా 1.0 సెం.మీ. నాంపల్లిలో అత్యధికంగా 9.5 సెం.మీలు వర్షపాతం నమోదైంది. వాన నీటికి సముద్రాన్ని తలపించింది. కొద్దిచోట్లు ఇళ్లలోకి నీరు చేరడంతో.. ప్రజలు ఇబ్బంది ఎదుర్కొన్నారు. అధికారులు అప్రమత్తయ్యాయి. ప్రమాదాలు సంభవించకుండా, తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు.