NTV Telugu Site icon

Rains in Warangal: వదలని వానలు.. డేంజర్ జోన్ లో వరంగల్..!

Warangal

Warangal

Rains in Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ ప్రజలకు పలు సూచనలు చేసింది. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని సూచించింది. వర్షాకాలంలో బయటకు రావద్దని హెచ్చరించింది.

Read also: Waterfalls: ఆనందం కోసం వెళితే… అడవిలో చిక్కుకున్న 60 మంది

ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. వర్షాలు మరియు వరదల నుండి సహాయం కోసం 18004251980 నంబర్‌ను పేర్కొన్నారు. మరోవైపు తూర్పు, ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రిలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


Dipti Bhatnagar: 18 ఏళ్లకే మిస్ ఇండియా.. 22 ఏళ్లకు స్టార్ హీరోయిన్.. 55లోనూ అందాల సునామీ

Show comments