NTV Telugu Site icon

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. తెల్లవారుజాము నుంచే కుండపోత వానమొదలైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌లో భారీగా వర్షం కురిసింది. అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్‌లో ప్రధాన రహదారులపై వరద పొంగిపొర్లుతోంది. కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్టలో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. లక్డీకాపూల్, సికింద్రాబాద్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ జంక్షన్లలోని రోడ్లపై నీళ్లు చేరాయి. రహదారులపై చేరిన నీటితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. గండిపేట్, మొయినాబాద్‌ ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వాన పడుతోంది.