ఈరోజు తెల్లవారుజాము నుంచి నగరంలో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడటంతో లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. తెల్లవారు జాము 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వర్షం కురిసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోనే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం… తడిసిముద్దైన మహానగరం…
