Site icon NTV Telugu

Hyderabad Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు రోడ్లు జలమయం..

Rain

Rain

వేసవికాలంల భానుడి ధాటికి చెమటలు కక్కుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురియడంతో పలు చోట్లు జలమయంగా మారాయి. అంతేకాకుండా ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో.. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అయితే రంగంలోకి దిగిన జీఎచ్‌ఎంసీ సిబ్బంది.. చెట్లను తొలగించారు. దీంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. వర్షపు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఉక్కపోతతో విసిగిపోయిన హైదరాబాద్‌ వాసులకు భారీ వర్షంతో కొంత ఊరట లభించింది. అయితే పలు చోట్ల భారీ వర్ష కారణంగా విద్యుత్‌ శాఖ అధికారులు విద్యుత్‌ను నిలిపివేశారు. రోడ్లపైకి కూడా వర్పుపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తాయి.

అయితే.. సికింద్రాబాద్ లోని సీతాఫల్మండి లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. బంసిలాల్ పేట్ లో 6.7 సెంటీమీటర్లు.. వెస్ట్ మారేడ్ పల్లిలో లో 6.1 సెంటీమీటర్లు.. అల్వాల్లో 5.9 సెంటీమీటర్లు.. ఎల్బీ నగర్ లో 5.8 సెంటీమీటర్లు.. గోషామహల్ బాలానగర్ లో 5.4 సెంటీమీటర్లు.. ఏఎస్ రావు నగర్ లో 5.1 సెంటిమీటర్లు.. బేగంపేటలోని పాటిగడ్డ లో 4.9 సెంటీమీటర్లు.. మల్కాజ్గిరిలో 4.7 సెంటీమీటర్లు.. సరూర్నగర్ ఫలక్నామా లో 4.6 సెంటి మీటర్లు.. గన్ ఫౌండ్రీ లో 4.4 సెంటీమీటర్లు.. కాచిగూడ , సికింద్రాబాద్ లో 4.3 సెంటీమీటర్లు.. చార్మినార్ లో 4.2 సెంటీమీటర్లు.. గుడిమల్కాపూర్ నాచారం లో 4.1 సెంటి మీటర్.. అంబర్పేట్ లో 4 సెంటీమీటర్లు.. అమీర్‌పేటలోని సంతోష్ నగర్ లో 3.7 సెంటీమీటర్లు.. ఖైరతాబాద్‌లో 3.6 సెంటీమీటర్లు.. బేగంబజార్, హయత్ నగర్ లకనగర్ లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Exit mobile version