తెలంగాణను వర్షాలు వీడనంటున్నాయి. ఇప్పటికీ నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుంటే.. మరో పక్క బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం చూపుతోంది. అయితే.. తాజాగా ఐఎండీ తెలంగాణకు మరో 7 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. అంతేకాకుండా.. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 16 వరకు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు కురుస్తాయని తెలిపిన ఐఎండీ.. అదే సమయంలో.. అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలతో పాటు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో పాటు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ చేసింది ఐఎండీ. అయితే.. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
IMD : తెలంగాణకు 7 రోజులు వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Alert