NTV Telugu Site icon

HYD Rains : ఉత్తర హైదరాబాద్‌ ఉతుకుడేనంట.. జర భద్రం..

Rain Alert

Rain Alert

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ఆలస్యంగా ప్రవేశించాయి. అయితే ఆలస్యంగా తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు విస్తరించడంలో కూడా మందగిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తాజాగా వాతావరణ శాఖ తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీంతో పాటు హైదరాబాద్‌లోని నార్త్‌, వెస్ట్‌ ఏరియాల్లో నేటి రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

అయితే ఇప్పటికే మహబూబ్‌నగర్‌ జిల్లాలో వర్షం దంచికొడుతోంది. అంతేకాకుండా హైదరాబాద్‌లోని మెహదీపట్నం, మల్లెపల్లి, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాత్రికి ఇంకా పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు.. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.