హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. ఉప్పల్ లో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం పడగా… హయత్ నగర్ లో 19.2 సెంటీమీటర్లు.. సరూర్ నగర్ లో 17.2 సెం. మీ వర్షపాతం నమోదు అయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి కేటీఆర్ సూచించారు. నీటమునిగిన ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి జిహెచ్ఎంసి డిజాస్టర్ బృందాలు .
ఇక హైదరాబాద్ లో బారి వర్షాలు కురవడంతో హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో ఏ క్షణంలోనైనా సాగర్ క్రస్ట్ గేట్ల ఎత్తవచ్చు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుతం 1760.50 అడుగులు ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజేంద్రనగర్ ఆర్డీఓ చంద్రకళ హెచ్చరించారు.