Rohit Reddy: ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి రిట్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ చేపట్టనుంది. ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది. ఈడీ దర్యాప్తుపై స్టే విధించాలన్న రోహిత్‌రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కేసు తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.. అప్పటికి రోహిత్ రెడ్డి పిటిషన్ పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ కి హైకోర్టు ఆదేశించింది. అయితే.. 30వ తేదీన రోహిత్ రెడ్డి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చామని అయితే రోహిత్ రెడ్డి విచారణకు హాజరు కావలసిన అవసరం లేదన్న విషయాన్ని ఈడీ స్పష్టం చేసింది. రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాది తన క్లయింట్ రెండుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారని న్యాయమూర్తికి తెలిపారు. ఈడీ అడిగిన వివరాలన్నింటినీ సమన్లలో సమర్పించినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా పడింది.
Read also: Coldest Morning: ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
ఈడీ దర్యాప్తును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ ను రోహిత్ రెడ్డి దాఖలు చేసిన విషయం తెలిసిందే.. పిటిషన్ లో నలుగురుని ప్రతివాదులుగా చేర్చారు. యూనియన్ ఆఫ్ ఇండియా, ఈడీ, జాయింట్ డైరెక్టర్ ఈడీ, అసిస్టెంట్ డైరెక్టర్ లను రోహిత్ రెడ్డి ప్రతి వాదులుగా చేర్చారు. ECIR 48/2022 క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈసీఐఆర్ 48/2022 లో ఎటువంటి చర్యలు తీసుకోకుండా కోర్ట్ ఆదేశాలు ఇవ్వాలంటు పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్టికల్ 14, 19, 21 ఉల్లంఘనకు ఈడి పాల్పడిందని పిటిషన్ లో తెలిపారు రోహిత్ రెడ్డి. ఈడి తదుపరి చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని రోహిత్ రెడ్డి కోరారు. అన్నింటినీ పరిశీలించి ఈడీ దర్యాప్తు పై స్టే ఇవ్వాలని రోహిత్ రెడ్డి కోరారు. మరోవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఈడీ విచారణకు హాజరుకాలేదు.