NTV Telugu Site icon

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కవిత బెయిల్‌పై సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసినా.. ఈడీ చేయలేదు. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం ఇవ్వాలని వారు ధర్మాసనాన్ని కోరగా, ఈడీ అభ్యర్థనపై కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది.

Read also: Hyderabad Metro: మెట్రోలో ప్రయాణికుల రద్దీ.. ప్రయాణికులతో నిండిపోయిన స్టేషన్లు..

గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. శుక్రవారం లోపు కవిత తరఫున న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది. వచ్చే మంగళవారానికి ఆగస్ట్ 27 కు సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసి, మార్చి 16న ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు అనుమతితో కవితను ఈడీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
RTC Rakhi Record: ఆర్టీసీ రాఖీ రికార్డ్.. ఒక్క రోజే 64 లక్షల మంది ప్రయాణం..

Show comments