MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహాద్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ చేపట్టనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని పేర్కొంటూ ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు.
ఇక.. అదే సమయంలో సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోరారు. లిక్కర్ పాలసీ కేసు విచారణలో ఉందని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వవద్దని ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈడీ వాదనలు విన్న న్యాయమూర్తి.. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న వాయిదా వేసారు. అయితే ఈరోజు కవితకు బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా? అనే దానికిపై ఉత్కంఠ నెలకొంది.
Read also: PM Modi: నేటితో ఆర్బీఐ ఏర్పాటై 90 ఏళ్లు.. హాజరు కానున్న ప్రధాని మోడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. మార్చి 16న ఆమె ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఈడీ 10 రోజుల కస్టడీ కోరగా, కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది. ఆ తర్వాత మరో ఐదు రోజుల పాటు కస్టడీలో ఉంచాలని కోరగా.. మూడు రోజుల పాటు అనుమతించారు. చివరకు మార్చి 26న ఈడీ అధికారులు కవితను కోర్టులో హాజరుపరిచారు. కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు.. ఇదిలా ఉండగా, మార్చి 26న 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ సందర్భంగా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కవిత న్యాయమూర్తి కావేరీ బవేజాను కోరారు.
దీంతో ఇంటి నుంచి ఆహారం తీసుకెళ్లేందుకు, దుస్తులు ధరించేందుకు, మంగళసూత్రం ధరించేందుకు, సొంతంగా మంచాలు వేసుకునేందుకు, దుప్పట్లు, చెప్పులు ధరించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. అయితే తీహార్ జైలు అధికారులు అనుమతించడం లేదని కవిత తరపు న్యాయవాది ఈ నెల 28న మళ్లీ కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇవాళ విచారణ సందర్భంగా కవిత తరఫు న్యాయవాదులు మరోసారి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మధ్యంతర బెయిల్ మంజూరు కాకపోతే, జైలులో రిమాండ్ ముగిసే వరకు ఆ సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించాలని కోర్టును కోరవచ్చు.
PM Modi: నేటితో ఆర్బీఐ ఏర్పాటై 90 ఏళ్లు.. హాజరు కానున్న ప్రధాని మోడీ