Site icon NTV Telugu

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంటూ ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించింది.

Read also: Gold Scam: తక్కువ ధరకే బంగారం అంటూ 4 కోట్లు కాజేసి పరార్..

మార్చి 16న లిక్కర్ పాలసీ ఈడీ కేసులో, ఏప్రిల్ 11న సీబీఐ కేసులో కవిత అరెస్టయిన సంగతి తెలిసిందే.కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్-19 ప్రకారం.. కవిత అరెస్ట్ చట్ట విరుద్ధమని, ఆమె రూ.100 కోట్లు చెల్లించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని ఆమె తరపు న్యాయవాది కోర్టులో గట్టిగా వాదించారు. ఈ మేరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ, సీబీఐలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.
Weather Report: లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..

Exit mobile version