Site icon NTV Telugu

Harishrao: నూకలు తినమని అవమానించారు

వరి యుద్ధం రసవత్తరంగా మారుతోంది. కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మంత్రుల పర్యటన తర్వాత మరింత వేడెక్కాయి రాజకీయాలు. తెలంగాణ మంత్రులు ఢిల్లీ పోయి వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను బీజేపీ మంత్రి పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. మనల్ని నూకలు తిను అనడం..యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమే అన్నారు మంత్రి హరీష్ రావు.

ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ధరలు తగ్గుతాయి. నూకలు తినమని అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి నూకలు చెల్లేలా తీర్పు ఇవ్వండి. పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్ పై పెంచిన ధరలను చేతనైతే తగ్గించి బీజీపీ నేతలు మాట్లాడాలి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను భర్తీ చేసింది. మళ్ళీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనుందన్నారు మంత్రి హరీష్ రావు. దేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలలో 15 లక్షల ఉద్యోగాలు పైగా ఖాళీగా ఉన్నాయి. దమ్ముంటే వెంటనే 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని హరీష్ రావు. బండి సంజయ్ దమ్ముంటే ముందు ఆ పని చేయించు కేంద్రంతో అని మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.

మరోవైపు వివిధ గ్రామపంచాయతీలు కేంద్రానికి తీర్మానాలు పంపుతున్నాయి. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ ప్రధాని మోడీ కి తెలంగాణ గ్రామాల నుండి వెల్లువెత్తుతున్నాయి విజ్ఞప్తులు. కరీంనగర్ మండలం నుండి తాహర్ కొండాపూర్ , చేగుర్థి, బహుదూర్ ఖాన్ పేట, మొదలు 17 గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కొత్తపల్లి మండలంలో 8 గ్రామాల్లో తీర్మానం చేయగా, ప్రతి గ్రామం నుండి తీర్మాన కాపీని కేంద్రానికి పంపించారు గ్రామ పెద్దలు. రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ కేంద్రం నుండి కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి తీర్మానం పంపారు. తెలంగాణలో పండిన రబీ వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version