Site icon NTV Telugu

Harish Rao: గవర్నర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం.. ద్వంద్వ నీతి కాదా ?

Harish Rao

Harish Rao

Harish Rao: కాంగ్రెస్, బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడిందని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయిందని ఫైర్ అయ్యారు. బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ గారు నిరాకరించారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారని తెలిపారు. ఇది ద్వంద్వ నీతి కాదా ? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా ? అని ప్రశ్నించారు.

Read also: AP Governor: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చేశాం: అబ్దుల్ నజీర్‌

గతంలో కూడా క్రీడా , సాంస్కృతిక , విద్యా సామాజిక , సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బిఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిందని గుర్తు చేశారు. అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదని మండిపడ్డారు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ , బిజెపి రెండు పార్టీలు ఒక్కటై బిఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలో గవర్నర్ గారు స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరం. న్యాయ సూత్రాలు , రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలి. కానీ బిఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు తేడా చూపిస్తున్నారు.


K.Lakshman: తెలుగు తేజాలకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ రావడం సంతోషం

Exit mobile version