Site icon NTV Telugu

Harish Rao : బండి సంజయ్‌వి ఝటా మాటలు..

Telangana Finance and Health Minister Harish Rao Fired On Telangana BJP Chief Bandi Sanjay.

బండి సంజయ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీష్‌ రావు ఆరోపించారు. శనివారం అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ప్రశ్నలు వస్తే తిట్ల పురాణం అందుకుంటున్నారని, కేటీఆర్ సవాల్ పై బీజేపీ నేతలు వాస్తవాలు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్తున్నారని ఆయన మండిపడ్డారు. 3,65,797 కోట్లు కేంద్రంకు తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపేణా వెళ్ళిందని, కానీ కేంద్రం నుంచి వచ్చింది 1,68,647 కోట్లు మాత్రమే.. ఇవి కాగ్ లెక్కలు అన్నారు.

తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని, కేంద్రం తెలంగాణకు హక్కుగా 7183 కోట్లు ఇవ్వాలి …అవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆర్థిక సంఘం సూచనలను కూడా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ ఝుట మాటలను మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఏడు ఏళ్ళ నుంచి అడుగుతున్న ఏపీ నుంచి రావాల్సిన డబ్బులు(454 కోట్లు ) గురించి అడుడుగుతుంటే అతిలేదు…గతిలేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version