NTV Telugu Site icon

Harish Rao: కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా.. మైనంపల్లి పై హరీష్‌ రావ్‌ ఫైర్‌

Harish Rao

Harish Rao

Harish Rao: కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా అంటూ మైనంపల్లి పై మంత్రి హరీష్ రావ్ మండిపడ్డారు. మల్కాజ్ గిరి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇక్కడ ఎన్నికలు మంచి మనసున్న మనిషి మాటలు, ముఠాల మనిషి మధ్య పోటీ అన్నారు. మైనంపల్లి స్వార్థం కోసం పార్టీ మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్, మల్కాజగిరి రెండు చోట్ల ఓడటం ఖాయమన్నారు. కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డొడా? అని ప్రశ్నించారు. 28 రోజులు కష్టపడి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. దత్తత తీసుకొని అభివృద్ధికి బాధ్యత తీసుకుంటా అని మంత్రి అన్నారు. ఏ సర్వే చూసినా 75 నుండి 80 సీట్లతో బిఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. కర్ణాటకలో కుర్చీల కొట్లాట జరుగుతున్నది. ఒకర్ని దించాలే, మరొకరిని ఎక్కించాలన్నారు. కేసీఆర్ రాకుంటే రియల్ ఎస్టేట్ ఢమాల్ అవుతుందని తెలిపారు.

భూమికి బరువైన పంట పండుతున్నది. రైతు బంధు, రైతు బీమా తో వ్యవసాయం పండగ అయ్యిందని తెలిపారు పల్లె పల్లేన పల్లర్లు మొలిచే తెలంగాణలో అని నాడు పాటలు ఉండేవన్నారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అని ఉండే అన్నారు. నేడు ఆ పాటలు తిరగ రాయాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇవన్నీ ఎలా సాధ్యం అయ్యింది. మంత్రం వేస్తే అయ్యిందా, మాయ చేస్తే అయ్యిందా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు రైతుల వద్ద డబ్బులు తీసుకున్నవి. మా ప్రభుత్వం రైతులకు డబ్బులు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ రిజెక్టేడ్ నాయకులు. పోటీ చేసేందుకు నాయకులు లేరన్నారు. పోటీ చేసేందుకు నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరని తెలిపారు.
Andrapradesh : ఈ లేడీ ముందు గజ దొంగలు పనికిరారు.. మద్యం కోసం పెద్ద సొరంగమే తవ్విందిగా..