Site icon NTV Telugu

Harish Rao: పేదలకు మరింత మెరుగైన వైద్యం

Harishrao (1) Min

Harishrao (1) Min

తెలంగాణ ఏర్పాటయ్యాక పేదలకు మరింత మెరుగైన వైద్యం అందుతోందన్నారు రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. రాష్ట్ర ఏర్పాటు నుంచి క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రభుత్వం రూ.750కోట్లు ఖర్చు చేసిందన్నారు.ప్రముఖ భారతీయ వైద్యుడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్యాన్సర్‌ నిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు ఆత్మకథ ‘The Journey of my life’ బుక్‌ను రాష్ట్ర ఆర్థిక, వైద్యరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఆవిష్కరించారు. తెలుగు యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అందరితో కలిసి బుక్‌ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్‌ నోరి అమెరికా అధ్యక్షుడికే వైద్యం అందించిన పేదలకు సైతం సేవలందించారని కొనియాడారు. డాక్టర్ చదివే ప్రతి వారికి నోరి ఆత్మకథ ఉత్సాహాన్ని ఇస్తుందని, బుక్‌ను ప్రతి పౌరుడు చదవాల్సిన అవసరం ఉందన్నారు.

Read Also: khaki Ganpati: ముంబై పోలీస్ వెరైటీ ఆలోచన..కొలువు దీరిన “ఖాకీ గణేష్”

క్యాన్సర్‌ను జయించిన వారి విజయాలను ఈ బుక్‌లో పొందుపరిచారని, ఇది అందరికీ స్ఫూర్తి అని, అద్భుతమైన పుస్తకం అని మంత్రి కొనియాడారు. విజయవంతమైన వైద్యుడి జీవితంలో ఎన్ని కష్టాలు, ఎంత శ్రమ ఉంటుందని.. వాటిని అధిగమించి ఉన్నత స్థితికి ఎలా చేరారనే విషయాలు ఈ పుస్తకం చదివితే తెలుస్తుందన్నారు. ఈ ఆత్మకథ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుందన్నారు. ప్రపంచంలో క్యాన్సర్‌ చికిత్సలో వస్తున్న అధునాతన విధానాలను వివరించారన్నారు. ఎంజేఎన్‌ ఆసుపత్రికి సలహాదారుడి ఉండి.. మెరుగైన వైద్యం పేదలకు అందేలా సహకారం అందించాలని డాక్టర్‌ నోరిని హరీశ్‌రావు కోరారు. పేదలు వైద్యం కోసం ఎక్కువ ఖర్చుపెట్టే స్థితిలో వుండరన్నారు. అందుకే ప్రభుత్వం వైద్య రంగంలో అధిక వ్యయం చేస్తోందన్నారు.

Read Also: Nasa: నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా.. కారణం ఇదే..!!

Exit mobile version