NTV Telugu Site icon

Harish Rao : నా కల నెరవేరింది..

minister harishrao

సిద్ధిపేట జిల్లా కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్ధిపేటకు కేంద్రీయ విద్యాలయం అనేది నా పదేళ్ల ప్రయత్నం 2018లో ఫలించిందని ఆయన అన్నారు. సిద్ధిపేటకు కేంద్రీయ విద్యాలయం నా కల నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. రూ.24 కోట్ల రూపాయల వ్యయంతో ఏన్సాన్‌పల్లిలో కేంద్రీయ విద్యాలయం కోసం నూతన భవన నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు.

యూపీఏ ప్రభుత్వం హయాంలో అప్పటి కేంద్ర మానవ వనరుల మంత్రి పల్లం రాజు సిద్ధిపేటకు వచ్చిన కేంద్రీయ విద్యాలయాన్ని సమైక్య రాష్ట్రం తెనాలికి తీసుకెళ్లారని ఆయన వెల్లడించారు. అప్పటి నుంచి నిరంతరం ప్రయత్నిస్తే 2018లో మన సిద్ధిపేటకు కేంద్రీయ విద్యాలయం వచ్చిందని ఆయన అన్నారు. ఇవాళ సిద్ధిపేట ఒక విద్యాక్షేత్రంగా విరాజిల్లుతున్నది.

4 పాలిటెక్నిక్ కళాశాలలు, 1 ప్రభుత్వ ఐటీఐ కళాశాల, 1 పీజీ కళాశాల, 1 మహిళా డిగ్రీ కళాశాల, 2 ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్ కళాశాలలు, 2 ప్రభుత్వ, ప్రయివేటు నర్సింగ్ కళాశాలలు సిద్ధిపేటలో నెలకొల్పుకున్నామన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ప్రిన్సిపల్ మార్కండేయులు, అధ్యాపక బృందం ఉన్నారు. ఈ మేరకు విద్యార్థినీ, విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.